
కాకాని గోవర్ధన్ రెడ్డి ( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షత అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో 9 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై పరిశీలన చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ పై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. శాసన సభ సభ్యుల పేర్లు శిలాఫలకంలో లేకపోవడం, అధికారులు సరిగ్గా స్పందించకపోవడం, శాసన సభ్యులని చపరచడం,ప్రొటోకాల్ పాటించని వాటిపై మాట్లాడినట్లు వివరించారు. 174 మందికి ప్రాతినిద్యం వహిస్తున్న స్పీకర్ పై కూడా విమర్సలు చేయడం దురదృష్టకరం అన్నారు. సీడీ వంటి ఆధారాలతో సహా పంపినా కొంతమంది సభ్యులు వివరణ సరిగ్గా ఇవ్వలేదన్నారు. సరైన సమాధానం చెప్పని సభ్యులని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్లు పేర్కొన్నారు.
‘‘ప్రివిలేజ్ కమిటీ పారదర్శకంగా వ్యవహరిస్తుంది. శాసన సభ్యుల హక్కులు కాపాడటం మా విధి. అచ్చెన్నాయుడు మొదటిసారి ఇచ్చిన వివరణ సరిగ్గా లేనందున రెండవ సారి వివరణ కోరితే ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయనని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తున్నాం. కోవిడ్ నేపథ్యంలో హాజరుకాలేనని మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణనిచ్చారు. నిమ్మగడ్డపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఎవరు ఎవరిపై తప్పుడు వ్యాఖ్యలు చేసినా పరిగణనలోకి తీసుకుంటాం. సభ్యులందరి హక్కులు కాపాడటం కోసం ప్రివిలేజ్ కమిటీ పనిచేస్తుంది. త్వరలోనే జిల్లాలలో పర్యటిస్తాం. ఆగస్ట్ పదవ తేదీన ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం ఉంటుంది.’’ అని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
కాగా, ఈ సమావేశానికి ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మల్లాది విష్ణు,యూ.వి రమణ మూర్తి రాజు, ఎస్.వి చిన అప్పలనాయుడు, వి.వర ప్రసాద రావు,శిల్పా చక్రపాణి రెడ్డి , అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ మా చార్యులు తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment