
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎప్పుడు ఎన్నికలొచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నైతికత, సిద్ధాంతం లేదు. ఎవరితోనైనా పొత్తుకు ప్రయత్నాలు చేస్తారు. వీళ్లంతా కట్టకట్టుకుని వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, మిగిలిన పార్టీలన్నీ ఒకే మాట మాట్లాడుతున్నాయి. వీరంతా కలిసే పని చేస్తున్నారన్నారు.
చదవండి: బాబు పాపం వల్లే ‘పోలవరం’ ఆలస్యం
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం. అందుకే భయం, బాధతో చంద్రబాబు రెండేళ్ల ముందే పొత్తులు గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చరిత్ర ఎవరికి తెలియదు..? బీజేపీతో పొత్తు అన్నాడు. దత్తపుత్రుడిని పక్కన పెట్టుకుని నడిచాడు. మళ్లీ అదే బీజేపీని తిట్టిపోసాడు. మళ్లీ ఇప్పుడు పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు. మామ ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్న వ్యక్తికి నైతికత ఏముంటుందని మంత్రి కాకాణి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment