బీఏసీ సమావేశంలో తమ ఎజెండాను స్పష్టంగా చెప్పామని వైఎస్సార్ సీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.
హైదరాబాద్: బీఏసీ సమావేశంలో తమ ఎజెండాను స్పష్టంగా చెప్పామని వైఎస్సార్ సీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... కనీసం మూడు రోజులైనా పెంచాలని కోరినా ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని వెంటనే చర్చకు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలతో పాటు పలు ప్రజాసమస్యలపై చర్చించాలంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. దురాలోచనతో తాము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదని స్పష్టం చేశారు.