ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం జరిగిన బీఏసీ సమావేశంలో 15 అంశాలపై చర్చించాలని బీఏసీలో లేవనెత్తామని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం జరిగిన బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో 15 అంశాలపై చర్చించాలని బీఏసీలో లేవనెత్తామని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చెప్పారు. ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలని నిర్ణయం తీసుకోగా.. తాము ఎక్కువ రోజులు నడపాలని కోరామని ఆయన అన్నారు.
తమతో పాటు బీజేపీ కూడా సమావేశాలు పొడిగించాలని కోరినట్టు జ్యోతుల చెప్పారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం 5 రోజులే సభను పరిమితం చేసిందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని జ్యోతుల నెహ్రు విమర్శించారు.