
యనమల కుదరదన్నారు: వైఎస్‌ఆర్ సీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 13 రోజులు మాత్రమే జరుపుతామని అనడం పద్ధతి కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 13 రోజులు మాత్రమే జరుపుతామని అనడం పద్ధతి కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. బిజినెస్ ఎడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం అనంతరం పార్టీ నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ సభలో చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. మరో పది రోజుల పాటు సమావేశాలు పొడిగించమని అడిగామని అయితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కుదురదన్నారని తెలిపారు.
ప్రజల సమస్యలను అసెంబ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని, అయితే అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నెలరోజులైనా అసెంబ్లీ సమావేశాలు ఉండాలని, అప్పుడే ప్రజాసమస్యల మీద చర్చించడానికి వీలుంటుందని అన్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28 వరకూ జరగనున్నాయి.