ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా | ap assembly adjourned to tomorrow | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

Published Mon, Mar 27 2017 6:12 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

ap assembly adjourned to tomorrow

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. రవాణా శాఖ కమీషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమాలను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు.

కేశినేని, బోండా ఉమలను అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. వీరిద్దరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. చెవిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఆందోళన మధ్య అసెంబ్లీ వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement