హైదరాబాద్ : ఏపీ బీఏసీ( ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్) సమావేశం గురువారమిక్కడ ప్రారంభం అయింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండాను బీఏసీ భేటీలో ఖరారు చేయనున్నారు. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మూడురోజుల పాటు రోజుకు పది గంటలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే 13 అంశాలపై చర్చ జరపాలని నిర్ణయం తీసుకుంది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అయితే వైఎస్ఆర్ సీపీ ...సభలో 36 అంశాలపై చర్చకు పట్టుబట్టింది. అధికార పక్షం మాత్రం అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులకు మించి జరపలేమని తెలిపింది. అధికారపక్షం నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి బీఏసీ నుంచి వాకౌట్ చేశారు.
బీఏసీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
Published Thu, Sep 8 2016 8:55 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM
Advertisement