
హోదా అవసరం లేదన్నట్టుగా....
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లు తెరవాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్టుగా మంత్రులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నాయకులు ప్యాకేజీలు తెచ్చుకుని జేబులు నింపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. విభజన హామీలు అమలు కాకపోవడం కేంద్రం చేతగానితనమే అని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.