ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ తప్పించుకునే ధోరణిలో మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.
రాజమండ్రి: ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ తప్పించుకునే ధోరణిలో మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ఆ ఏపీకి నిధులిస్తామని ఎక్కడా చెప్పలేదని అన్నారు.
హోదా ఇవ్వకపోయినా దానికి తగిన స్థాయిలో హామీ ఇస్తారని ప్రజలు ఆశించారని చెప్పారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేశారని, ఇదంతా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడిన అంతర్నాటకంలా కనిపిస్తుందని చెప్పారు. యమునా నది నుంచి నీరు తెచ్చి సరిపెట్టుకోమని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.