పిఠాపురం : కాపు ఉద్యమం ద్వారా బీసీలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ సామాజిక వర్గమైన కాపులను బీసీల్లో చేర్చాలని అడుగుతున్నామే తప్ప బీసీ సోదరులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో మార్పు చేయమనడం లేదని స్పష్టం చేశారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమానికి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తప్పక తన పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే వైఎస్సార్‌సీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వర్తింపచేస్తున్న రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా కాపు సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన అదనంగా రిజర్వేషన్లు అడుగుతున్నామన్నారు. ఒకరికి అన్యాయం జరగడానికి కాపు సామాజిక వర్గం ఎప్పుడూ ఒప్పుకోదని ఆయన స్పష్టం చేశారు. ఈ సామాజిక వర్గంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే కాపు ఉద్యమ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా చేపట్టిన కాపు ఉద్యమం తమ హక్కును సాధించుకోవడం ఖాయమని జ్యోతుల పేర్కొన్నారు.
27న కాకినాడలో వైఎస్సార్ సీపీ యువభేరి
ఈనెల 27న కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యువభేరి నిర్వహిస్తున్నామని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని జ్యోతుల తెలిపారు. 21న నిర్వహించాల్సిన యువభేరి అనివార్యకారణాల వల్ల వాయిదా పడిందన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచీ పార్టీలకతీతంగా ఉన్నత విద్యావంతులు యువభేరికి హాజరయ్యేలా ప్రతి నాయకుడూ, కార్యకర్తా పనిచేయాలన్నారు. విద్యార్థి సమస్యలు, ఉపాధి అవకాశాలపై ప్రశ్నించగలిగే విద్యావంతులం తా యువభేరికి వచ్చి సమస్యలను తెలియజేయాలని కోరా రు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కన్వీనర్ పెం డెం దొరబాబు మాట్లాడుతూ యువభేరి విజయవంతానికి అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం సభ్యుడు మధుసూదన్‌రెడ్డి, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కురుమళ్ల రాంబాబు, పార్టీ నేతలు గండేపల్లి బాబీ, అబ్బిరెడ్డి రామచంద్రారెడ్డి, కారే శ్రీనివాసరావు, మొగిలి అయ్యారావు, ఆనాల సుదర్శన్, జ్యోతుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు అన్యాయం జరగనివ్వం
Published Thu, Jan 21 2016 1:19 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement