
'బంద్ అడ్డుకునేందుకు సీఎం కుట్ర'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ చేపట్టనున్న బంద్ కు వామపక్షాలు మద్ధతు పలకడం సంతోషంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు.గురువారం పట్టణంలోని మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బంద్ను నిర్వీర్యం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా సంజీవని కాకపోతే ఎన్నికల ముందు చంద్రబాబు ఎందుకు హామీ ఇచ్చినట్లు అని ఆయన ప్రశ్నించారు. మోసపూరిత విధానంతో వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడం కోసం బాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.