
రైతులను మోసం చేసిన ప్రభుత్వం
సీతానగరం : పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని తప్పుడు వాగ్ధానాలు చేసి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని జగ్గంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. బుధవారం పురుషోత్తపట్నంలోని పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల అనంతరం సీతానగరం మదర్ థెరిస్సా సెంటర్‌లోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రైతులను ఎన్నికల ముందు రుణాలు చెల్లించవద్దని చెప్పిన టీడీపీ ఇప్పుడు రుణ మాపీ కంటితుడుపుగా ఇచ్చిందన్నారు.
రూ. 80వేల కోట్లు రైతులు రుణాలు పొందారని, ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లు మాత్రమే మాఫీ చే స్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఇప్పుడు షరతులు విధిస్తున్నారన్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పని వ్యక్త అని ఆయన అన్నారు. ైరె తుల రుణమాఫీ సాధ్యం కాదన్నారని తెలిసి జగన్ హామీ ఇవ్వలేదన్నారు. మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రైతులు ఎమ్మెల్యేను శాలువ కప్పి సత్కరించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వలవల రాజా, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముళ్ల సుబ్బారావు, ఈత గణేష్ నాయుడు, చీకట్ల వీర్రాజు, ద్వారంపూడి రామకృష్ణ, కోలా మాణిక్యాలరావు, జొన్నల పెదఅబ్బులు పాల్గొన్నారు