'చంద్రబాబు విమర్శలతో ఆమె కన్నీరు పెట్టారు' | kutuhalamma wept because of chandrababu, says jyothula nehru | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు విమర్శలతో ఆమె కన్నీరు పెట్టారు'

Published Fri, Mar 20 2015 6:51 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

'చంద్రబాబు విమర్శలతో ఆమె కన్నీరు పెట్టారు' - Sakshi

'చంద్రబాబు విమర్శలతో ఆమె కన్నీరు పెట్టారు'

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను విపక్షంలో ఉండగా స్పీకర్ను దారుణంగా విమర్శించారని వైఎస్ఆర్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. చంద్రబాబు విమర్శలకు అప్పటి డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ కన్నీరు పెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జ్యోతుల అన్నారు. గతంలో స్పీకర్ పదవిలో ఉన్నవారు నిబద్ధతతో వ్యవహరించి ఆ పదవికే వన్నెతెచ్చారని, కానీ ఈ స్పీకర్ మాత్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేస్తే తప్పు కాదు గానీ.. ఇప్పుడు తాము అంటే తప్పు అయ్యిందా అని జ్యోతుల నిలదీశారు. స్పీకర్ ఇప్పటికైనా తన మనసు మార్చుకుని వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు బెదిరింపులకు తాము భయపడేది లేదని, పట్టిసీమ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనిచ్చేది లేదని స్పష్టం చేశారు. పట్టిసీమపై చంద్రబాబు పునరాలోచించుకోకుంటే.. ఓ మహోద్యమానికి మీరే కారకులు అవుతారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement