రేవంత్రెడ్డి వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజమండ్రి: రేవంత్రెడ్డి వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు మాట్లాడారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ 1 ముద్దాయిగా పెట్టాలన్నారు. ఈ వ్వవహారాన్ని అవసరమైతే సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు.