రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు మొదలైన తొలిరోజే తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఘటనను మరిపించేందుకు అభినందన సభలు ఏర్పాటు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు మండిపడ్డారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పుష్కరాలు విజయవంతం అయ్యాయని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు.
'తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపించాలి'
Published Sun, Jul 26 2015 6:16 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM
Advertisement
Advertisement