'రౌడీలను ప్రోత్సహించే లక్షణం బాబుదే'
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): రౌడీలను ప్రోత్సహించే లక్షణం చంద్రబాబు నాయుడుకే ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ఎదుట వ్యక్తిపై ధైర్యంగా మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదని, అందుకే తన పక్కనున్న నేతలతో విమర్శలు చేయిస్తారని అన్నారు. రేపు బడ్జెట్‌పై శాసనసభలో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్న నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అసెంబ్లీని పక్కదోవ పట్టించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రతిపక్షంపైకి ఉసిగొల్పుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు నిన్న ఆరోపించారు.