
'చంద్రబాబు చేతిలో డీజీపీ కీలుబొమ్మ'
రాజమండ్రి:టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై నిలదీస్తే ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. దీనిలో భాగంగానే తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్టు చేశారన్నారు.
భూమాకు ఏమి జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు చేతిలో డీజీపీ రాముడు కీలుబొమ్మగా మారిపోయారని జ్యోతుల ఎద్దేవా చేశారు.