అసెంబ్లీ లాబీలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను ఎవరికీ చెప్పకుండా తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని జ్యోతుల నెహ్రూ అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను ఎవరికీ చెప్పకుండా తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ... మానవతావాదిగా గుర్తింపు పొందిన వైఎస్సార్ ఫోటోను తొలగించడం దారుణమన్నారు.
ఆయన ఫోటోను యధాస్థానంలో పెట్టాలని డిమాండ్ చేశారు. మహానేత చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే కరువు కోరల నుంచి రాష్ట్రం బయట పడుతుందన్నారు. కరువు పరిస్థితులపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరువు, తాగునీటి సమస్య, ఆత్మహత్యలపై చర్చించేందుకు వైఎస్సార్ సీపీ నేడు వాయిదా తీర్మానం ఇచ్చింది.