శాసనసభను సమన్వయం చేసే బాధ్యతను చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మర్చిపోయారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అన్నారు.
హైదరాబాద్ : శాసనసభను సమన్వయం చేసే బాధ్యతను చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మర్చిపోయారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అన్నారు. పది నిమిషాల వాయిదా అనంతరం అసెంబ్లీ ప్రారంభమైంది. 334 రూల్ పార్టీలతో సంబంధం లేదని జ్యోతుల నెహ్రు అన్నారు. చీఫ్ విప్గారు కిరికిరి పెట్టడానికి చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ తనపై చేసిన వ్యాఖ్యలను జ్యోతుల నెహ్రు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.