'జుట్టు పట్టుకుని ఈడ్చుకురావడం అన్యాయం'
కాకినాడ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళలను జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడం అన్యాయమని ఆయన అన్నారు. నూతన భూసేకరణ చట్టం అమల్లోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం దురుద్దేశపూరితంగా ఈ ఘటనకు పాల్పడిందని ఆరోపించారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే ముంపు బాధితులకు 4 రెట్లు పరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే దౌర్జన్యానికి దిగిందన్నారు. పోలవరం ముంపు బాధితులపై ఇలాంటి దాడులు ఆపకపోతే వైఎస్ఆర్ సీపీ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. పోలవరం ముంపు బాధితులకు పునరావాస కేంద్రాల వద్దే సారవంతమైన భూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.