
ఇంతగా దిగజారిపోతారా?
ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బటయపడేందుకు దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికి ఏపీ చంద్రబాబు వెనుకాడడం లేదని వైఎస్సార్ సీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు.
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బటయపడేందుకు దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికి ఏపీ చంద్రబాబు వెనుకాడడం లేదని వైఎస్సార్ సీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థలో ఉన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న మత్తయ్యను కాపాడేందుకు ఏపీ డీజీపీని గవర్నర్ వద్దకు పంపడం చూస్తుంటే ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతోందని అన్నారు.
ఈ కేసుతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, టీడీపీకి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి తప్పుమీద తప్పు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలు గ్రహించారని, అందుకే చంద్రబాబు మాటలు నమ్మడం లేదన్నారు.
వైఎస్సార్ సీపీ కార్యాలయం సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదాయం పెంచుకునేందుకు రైతులపై భారం మోపాలని టీడీపీ సర్కారు భావిస్తోందని, ఇందులో భాగంగా నీటి తీరువా రెండింతలు చేసేందుకు ప్రయత్నిస్తోందని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ఈ నిర్ణయం వ్యవసాయానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు.