గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు.
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరుతో పుష్కరాలకు వస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
శుక్రవారం రాజమండ్రిలో జ్యోతుల నెహ్రూ విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించడం లేదని, అంతా చంద్రజపంగా మారిందని ఆరోపించారు.