
'రేవంత్ ఘటన రాజకీయాలకు గొడ్డలిపెట్టు'
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ ఘటన రాజకీయాల్లో గొడ్డలిపెట్టులాంటిదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు.
గుంటూరు/విజయవాడ: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ ఘటన రాజకీయాలకు గొడ్డలి పెట్టులాంటిదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాక రాజకీయాల్లో ధన ప్రభావం చంద్రబాబుతోనే మొదలైందని విమర్శించారు. రేవంత్తో కథ నడిపించిన చంద్రబాబుపై చర్య తీసుకోవాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు.