వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేదిలేదని పార్టీ నేత జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు.
రంపచోడవరం: వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేదిలేదని పార్టీ నేత జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు. బుధవారం రంపచోడవరంలో జరిగిన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
పోలవరం ముంపు మండలాల నిర్వాసితులకు పట్టిసీమ ప్యాకేజీని అమలు చేయాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. అధికారులు వేధింపులు మానుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని అన్నారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం మానవతాదృక్పధంతో వ్యవహరించాలని కోరారు.