
జగన్‌ను సీఎంను చేయడమే లక్ష్యం
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేయడమే లక్ష్యంగా తాను జిల్లాపార్టీ నాయకత్వాన్ని చేపట్టినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు.
కాకినాడ రూరల్: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేయడమే లక్ష్యంగా తాను జిల్లాపార్టీ నాయకత్వాన్ని చేపట్టినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం సాయంత్రం శశికాంత్‌నగర్‌లోని సహకారశ్రీ నిలయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేయడమే తమ లక్ష్యం అన్నా రు.
ప్రతి నియోజకవర్గంలో గుండె ధైర్యం ఉన్న ముగ్గురు కార్యకర్తలుంటే 30 వేల మంది కార్యకర్తలను తయారు చేసుకోవచ్చనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా జిల్లా పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఒక్క ఫోన్ చేస్తే చాలని, ఆ కార్యకర్త తరఫున న్యాయం కోసం పోరాడతామన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, సీజీసీ స భ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిలను సన్మా నించారు. ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు, ఎస్సీసెల్ అధ్యక్షులు శెట్టిబత్తుల రాజబాబు, రెడ్డి రామసత్యనారాయణ, మిండగుదిటి మోహన్, కొండేటి చిట్టిబాబు, అత్తిలి సీతారామస్వామి, రావూరి వెంకటేశ్వరరావు, పబ్బినీడి సత్యనారాయణ మాట్లాడారు.