ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు సర్కార్ రుణమాఫీని అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. వరి క్వింటాల్కు 300 రూపాయలు బోనస్ ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ కోరారు.