ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించాలి: వైఎస్ జగన్
కడప: వర్షాభావం కారణంగా పంటలు పశువులకు కూడా పనికిరాకుండా పోయాయని, ప్రభుత్వం పంటలను పరిశీలించి రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు.
లింగాల మండలంలో తీవ్ర వర్షాభావం కారణంగా రైతులు నష్టపోయిన పంటలను వైఎస్ జగన్ పరిశీలించారు. రైతులు రుణాలను రీషెడ్యూల్ చేసుకోలేని స్థితిలో ఉన్నారని, దీంతో రావాల్సిన పంటల బీమా నష్టపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అరటి పంట పరిహారంపై నిర్ణయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 72 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తే పోతిరెడ్డిపాడు నుంచి గండికోటకు తాగునీరు వస్తుందని, దీన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతుల కష్టాలపై స్పందించాలని డిమాండ్ చేశారు.