
అసెంబ్లీ సమావేశాలు 15రోజులు పొడిగించాలి
ముఖ్యమైన సమస్యలు చర్చించడానికి శాసనసభ సమావేశాలను 15రోజుల పాటు పెంచాలని వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ముఖ్యమైన సమస్యలు చర్చించడానికి శాసనసభ సమావేశాలను 15రోజుల పాటు పెంచాలని వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగం, ఆత్మహత్యలు, కరువు, రుణమాఫీ, కనీస మద్దతు ధర సమస్యలను రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటుందని ఆయన గురువారమిక్కడ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జ్యోతుల నెహ్రు అన్నారు. ప్రజా సమస్యలపై శాసనసభలో చర్చించాలని ఆయన పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26వరకూ కొనసాగనున్నాయి.