
అవమానించేందుకు ప్రయత్నిస్తోంది
హైదరాబాద్ : ప్రతిపక్ష నేతలను అవమానపరిచేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ ఎల్పీ నేత జ్యోతుల నెహ్రు అన్నారు. యనమల రామకృష్ణుడు... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అవమానపరిచేలా అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగించారని ఆయన అన్నారు. తాము ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులమని జ్యోతుల స్పష్టం చేశారు.
దొడ్డిదారిన మంత్రి పదవులు తెచ్చుకోలేదన్నారు. యనమల క్షమాపణ చెప్పాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. అటువంటి పదాలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. సభ సాంప్రదాయం పాటించి చర్చ జరపాలన్నారు. ఆ తర్వాత సంపూర్ణంగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.