వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం | ys jagan mohan reddy donate rs 50 lacs to hudhud victims | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం

Published Wed, Oct 15 2014 9:59 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం - Sakshi

వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం

హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనవంతుగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు.  వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు.

కాగా, తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. సహాయం చేయదలిచిన వారికోసం బ్యాంకు ఖాతా ప్రారంభించినట్టు వెల్లడించాయి.  సహాయం చేయదలిచిన వారు డిడిలు, చెక్కులు ఇందులో జమ చేయొచ్చని తెలిపాయి. సాక్షి' కార్యాలయాల్లోనూ నేరుగా డిడిలు, చెక్కులు అందజేయవచ్చు.

అకౌంట్ పేరు: వైఎస్ఆర్ ఫౌండేషన్
అకౌంట్ నంబర్: 31868397566
బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐఎఫ్ఎస్ సీ కోడ్: ఎస్ బీఐఎన్ 0008022
బ్రాంచి: బంజారాహిల్స్, హైదరాబాద్
బ్రాంచి కోడ్: 08022
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement