- తుపాను బాధితులకు ఆపన్నహస్తం అందించండి
- దాతలకు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ పిలుపు
- విరాళాలకు సెక్షన్ 80జీ కింద ఆదాయ పన్ను మినహాయింపు
- ఈ-మెయిల్ ద్వారా రసీదు, డొనేషన్ సర్టిఫికెట్
సహృదయంతో స్పందించండి
Published Tue, Oct 21 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM
విరాళాలు పంపాల్సిన ఖాతా వివరాలు..
ఖాతా పేరు : వైఎస్సార్ ఫౌండేషన్
ఖాతా సంఖ్య : 31868397566
బ్యాంకు పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఎస్‌బీఐఎన్0008022
బ్రాంచి : బంజారాహిల్స్, ైెహ దరాబాద్
బ్రాంచి కోడ్ : 08022
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను రాకాసిలా విరుచుకుపడడంతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. విశాఖ నగరం ఓ విషాద సాగరమైంది. ఇలాంటి సమయంలోనే చేతనైన చేయూతనిచ్చి సాటి మనిషికి అండగా నిలవాలి. సహృదయంతో స్పందించాలి. లోగడ కూడా ఇటువంటి విపత్తులు చోటుచేసుకున్నప్పుడు వైఎస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా సహాయ, సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. బాధితులకు-వితరణశీలురకు మధ్య అంటే అవసరాలకు-వనరులకు మధ్య సంధానకర్తగా ఉండి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించాలని సంకల్పించాయి. హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సానుభూతి, సహృదయంతో ముందుకు వచ్చే దాతలందరి నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. సహృదయులంతా విరాళాలు పంపి సాటి వారికి అండగా నిలవాలని వైఎస్సార్ ఫౌండేషన్ - సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు ఉదారభావంతో ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి.
ఈ విరాళాలకు ఆదాయ పన్ను చట్టంలోని 80(జీ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సహాయం చేయదలచుకున్న వారు కింద తెలిపిన బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు(అకౌంట్ ట్రాన్స్‌ఫర్) పంపొచ్చు. ఇదే ఖాతాలో జమ అయ్యేలా డీడీ, చెక్కు రూపాల్లోనూ పంపొచ్చు. డీడీలు, చెక్కులను జిల్లాల్లో స్థానికంగా ఉండే ‘సాక్షి’ కార్యాలయాల్లోనూ నేరుగా అందించవచ్చు. బ్యాంకు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా విరాళమిచ్చిన దాతలు ఈ-మెయిల్ (ysrfoundation2005@gmail.com)ద్వారా తమ పేరు, చిరునామా తెలియ జేయాలి. వారికి రసీదు, దానితోపాటు 80జీ కింద పన్ను మినహాయిం చుకోవడానికి అవసరమైన డొనేషన్ సర్టిఫికేట్ పంపిస్తారు. రూ.5,000, అంతకుమించి విరాళమిచ్చే వారి పేర్లను ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తాం.
Advertisement