తుపాను బాధితులకు సాయం | Storm victims Help in srikakulam | Sakshi
Sakshi News home page

తుపాను బాధితులకు సాయం

Published Thu, Oct 30 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

తుపాను బాధితులకు సాయం

తుపాను బాధితులకు సాయం

ఎచ్చెర్ల/ఎచ్చెర్ల రూరల్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్‌ఆర్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు నడుంబిగించాయి. సహాయక చర్యల్లో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగుట్ల పాలేంలో బియ్యం, దుస్తులు (చీర,జాకెట్)అందజేశాయి. రేషన్ కార్డులు ఆధారంగా 500 మందికి ఈ కిట్లను అందజేశారు. పంపిణీ ప్రక్రియను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంట నష్టాలు అంచనా వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పాస్‌పుస్తకాలు, ఆధార్, బ్యాంకు పుస్తకాల కార్డులతో రైతులను ప్రదక్షిణలు చేయిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మాడుగుల మురళీధర్ బాబా, మాజీ మార్కెట్ కమిటీ చెర్మైన్ జీరు రామారావు, మాజీ సర్పంచి అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement