కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం రూ.4.7 లక్షలు | Kuwait ysrcp help's Rs .4.7 lakhs | Sakshi
Sakshi News home page

కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం రూ.4.7 లక్షలు

Published Sun, Nov 23 2014 2:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం రూ.4.7 లక్షలు - Sakshi

కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం రూ.4.7 లక్షలు

సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్  బాధితుల సహాయార్థం కువైట్‌లోని వైఎస్సార్ సీపీ గల్ఫ్ విభాగం తరపున రూ.4.7 లక్షల విరాళాన్ని వైఎస్సార్ ఫౌండేషన్‌కు అందచేశారు. పార్టీ గల్ఫ్ విభాగం కోఆర్డినేటర్ బీహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో   శనివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఈ మేరకు చెక్కును అందించారు.

కష్టాల్లో ఉన్న సాటి తెలుగువారిని ఆదుకునేందుకు కువైట్ తెలుగువారు స్పందించి విరాళాలు ఇచ్చినట్లు ఇలియాస్ తెలిపారు. వారి వితరణను జగన్ అభినందించారు. జగన్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్‌బాష, మేయర్ సురేష్‌బాబు, కువైట్ ప్రవాసులు జి.ఎస్.బాబురాయుడు, ఎస్.గయాజ్‌బాష, ఎస్.నజీర్, బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement