hudhud victims
-
గంటా ఇంట్లో లాటరీ.. ఏమిటీ కిరికిరి!
బహిరంగ ప్రదేశంలో.. సంబంధితులందరి సమక్షంలో తీయాల్సిన లాటరీని.. నాలుగ్గోడల మధ్య అనుకూలమైన కొద్దిమంది సమక్షంలో మమ అనిపించేశారు..వేల సంఖ్యలో నిర్మిస్తున్న హుద్‌హుద్ బాధితులకు నిర్మిస్తున్న ఫ్లాట్ల కేటాయింపు ప్రహసనమిది.. అది కూడా ఒక మంత్రి ఇంట్లో జరగడం ఆరోపణలకు, విమర్శలకు ఆస్కారమిస్తోంది.నాలుగేళ్ల క్రితం కకావికలం చేసిన హుద్‌హుద్ తుపానులో నష్టపోయిన వారి కోసం గ్రామీణ ప్రాంతంలో 810, ఆర్బన్ ప్రాంతంలో 4434 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో దాదాపు సగం మంత్రి గంటా నియోజకవర్గమైన భీమిలికే పోయాయి. నాలుగేళ్లపాటు ముక్కుతూ.. మూలుగుతూ ఎట్టకేలకు 2268 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటిని కేటాయించేందుకే శుక్రవారం మంత్రి గంటా ఇంట్లో లాటరీ తీసి.. అక్కడికక్కడే కొందరికి పత్రాలు పంపిణీ చేసేశారు. మంత్రి అనుచరులకు, టీడీపీ కార్యకర్తలకు ఇళ్లు దక్కేలా చేసేందుకే ఈ మంత్రాంగం నెరిపారని మిగతా బాధితులు ఆరోపిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా హౌసింగ్ కాలనీలో ఫ్లాట్ల్ల కేటాయింపు లబ్ధిదారుల సమక్షంలో ఆ కాలనీలోనే చేపడతారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు అందరూ చూస్తుండగా లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుపుతారు. కానీ ఇందుకు విరుద్ధంగా శుక్రవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలోని తన ఇంట్లో అతికొద్ది మంది లబ్ధిదారుల సమక్షంలో హుద్‌హుద్ ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ తీయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనర్హులకు ఇళ్ల కేటాయింపులు.. అడ్డగోలు దోపిడీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా జిల్లా హౌసింగ్ అధికారుల స్టైలే వేరు. మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ప్రాపకాన్ని పొందేందుకు వారు చూపిస్తున్న అత్యుత్సాహానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాన్ దెబ్బకు వేలాది మంది నిలువ నీడలేకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. విశాఖ జిల్లాలోనే లక్ష మందికిపైగా నిర్వాసితులు కాగా.. హుద్‌హుద్ పునర్నిర్మాణం పేరిట ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి పదివేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలోగా పూర్తి చేసి ఇవ్వాలని లక్ష్యం కాగా.. ఇంకా పూర్తి కాని దుస్థితి. ఇక విషయానికి వస్తే విశాఖ జిల్లాలో హుద్‌హుద్ బాధితుల కోసం గ్రామీణ ప్రాంతంలో 810, అర్బన్ ప్రాంతంలో 4434 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో అత్యధికంగా 2484 ఇళ్లు మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత నియోజకవర్గమైన ఒక్క భీమిలికే కేటాయించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2268 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, భీమిలిలో 784 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటి కోసం కాలనీ వద్దే మొత్తం లబ్ధిదారుల సమక్షంలో ఫ్లాట్ల కేటాయింపు జరగాలి. కానీ ఇందుకు భిన్నంగా శుక్రవారం ఎంవీపీ కాలనీలోని తన స్వగృహంలో మంత్రి గంటా ఫ్లాట్ల కేటాయింపు కోసం లాటరీ తీశారు. ఫ్లాట్లు దక్కించుకున్న పార్టీ కార్యకర్తలు, అనుచరులను ఇంటికి పిలిచి వారికి ఫ్లాట్ల కేటాయింపు చేయడం వివాదాస్పదమవుతోంది. తమ అనుచరులకు అనువుగా ఉండే ఫ్లాట్లనే లాటరీలో పెట్టి కేటాయింపులు జరిపారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. 216 మందికి గంటా ఇంట్లో లాటరీ ద్వారా కేటాయింపులు జరపడంపై మిగతా లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో అందరి సమక్షంలో తీయాల్సిన లాటరీని గంటా ఇంట్లో తీయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పారదర్శకతకు తూట్లు పొడుస్తూ హౌసింగ్ అధికారులు మంత్రి ప్రాపకం కోసమే ఈ పని చేశారని, ఈ లాటరీని రద్దు చేసి గృహ సముదాయం వద్దే అందరి సమక్షంలో ఫ్లాట్ల కేటాయింపు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీకాంత్ జట్టు విజయం
విజయవాడ:హుదూద్ తుపాను బాధితుల సహాయార్ధం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన టాలీవుడ్ సినీ తారల క్రికెట్ మ్యాచ్ లో తరుణ్ జట్టుపై శ్రీకాంత్ జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీకాంత్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన తరుణ్ జట్టు 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. లక్ష్యంగా భారీగా ఉండటంతో తరుణ్ జట్టు వరుస వికెట్లను కోల్పోయి పరాజయం పాలైంది. -
స్టార్ క్రికెట్ మ్యాచ్‌లో పరుగుల వర్షం
హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం విజయవాడలో జరుగుతున్న సినీతారల క్రికెట్ మ్యాచ్‌లో పరుగుల వర్షం పోటెత్తుతోంది. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహిస్తున్న టి-20 మ్యాచ్‌లో టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, తరుణ్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీకాంత్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. నిఖిల్ 40, నందకిశోర్ 35 పరుగులు చేశారు. తరుణ్ జట్టు లక్ష్యఛేదనలో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ కోసం మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు యువ హీరో రామ్ చరణ్ తేజ్, పలువురు హీరోయిన్లు, కామెడియన్లు, యాంకర్లు వచ్చారు. తమ అభిమాన నటులను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. క్రికెట్ మ్యాచ్‌తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జట్లు: తరుణ్ ఎలెవన్ : తరుణ్(కెప్టెన్), నరేష్, నితిన్, ప్రిన్స్, విశ్వా, సందీప్‌కిషన్, రఘు, రాజీవ్‌కనగాల, అయ్యప్ప, సామ్రాట్, అజయ్, శర్వానంద్. శ్రీకాంత్ ఎలెవన్: శ్రీకాంత్( కెప్టెన్), నాని, నిఖిల్, అదర్శ్, సాయిధర్మతేజ, మనోజ్, నవీన్‌చంద్ర, సుధీర్, నందకిషోర్, ప్రభు, కార్తీక్, ఖయ్యూం, భూపాల్, సమీర్, శశాంక్ . -
సాయం కోసం ఎదురుచూపులు
హుద్‌హుద్ బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పునర్ నిర్మాణం పేరిట సంబరాలకు కోట్లు కుమ్మరించిన ప్రభుత్వం కూడా నిధుల కోసం కేంద్రం వైపే చూస్తోంది. తుపాను మర్నాడే కేంద్రం తక్షణ సాయం వెయ్యికోట్లు ప్రకటించినా రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో పరిహారం పంపిణీ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మంగళవారం నుంచి పర్యటించనుంది. దీనిపైనే జిల్లా వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క నిలదీసేందుకూ సిద్ధమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను ఫలితంగా విభాగాల వారీగా ట్రాన్స్‌కోకు అత్యధికంగా రూ.1020.88 కోట్ల నష్టం వాటిల్లింది. పాక్షికంగా, తీవ్రంగా, పూర్తిగా దెబ్బ తి న్న ఇళ్లు లక్షా 43 వేల 761 ఉన్నాయి. వీటికి రూ.75.99కోట్లు అవసరమవు తుందని అంచనా. 34,180.22హెక్టార్లలో రూ.49.18కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. 55,334.608 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. ఫిషరీస్ డిపార్టుమెంట్‌కు రూ.38.06కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.124.78కోట్లు నష్టం వాటిల్లగా, వివిధ డిపార్టుమెంట్లకు రూ.7,986.20కోట్ల నష్టంవాటిల్లినట్టుగా లెక్క తేల్చారు. ఇదంతా ప్రభుత్వపరంగా జరిగిన నష్టమైతే పారిశ్రామిక రంగానికి 50వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. ఇలా దాదాపు రూ.65వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసిన రాష్ర్ట ప్రభుత్వం రూ.21.640.63 కోట్ల సాయం చేయాల్సిందిగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. తుపాను వచ్చిన మూడో రోజునే విశాఖ వచ్చిన ప్రధాన మంత్రి రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. రూ.450 కోట్లు రాష్ర్ట ప్రభుత్వానికి విడుదల చేసిందని చెబుతున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా జిల్లాకు కేటాయించలేదు. దీంతో పరిహారంఅందక ఆదుకునే వారు లేక బాధితులు అల్లాడిపోతున్నారు. నెలన్నర తర్వాత వస్తున్న కేంద్రం బృందం క్షేత్ర స్థాయిలో చూసేది ఏమీ లేకున్నా ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో వీరు ఇచ్చే నివేదికను బట్టే కేంద్రం సాయం ప్రకటించే అవకాశాలుండడంతో జిల్లా ప్రజలతో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ బృందం పర్యటనపైనే ఆశలు పెట్టుకుంది. కేంద్ర బృందం పర్యటన సాగిదిలా: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పాఠక్ నేతృత్వంలోని ఎనిమిది సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం విశాఖకు చేరుకోంది. తొలుత ఎయిర్ పోర్టుకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించి నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని తుఫాన్ నష్టం ఫోటోఎగ్జిబిషన్ను తిలకిస్తుంది. మర్నాడు ఉదయం నగరంలో నష్టాన్ని చూసి మధ్యాహ్నం అనంతగిరి వెళ్తుంది. 27న పరిశ్రమలులు..గ్రామీణ జిల్లాను పరిశీలిస్తుంది. బృందం పర్యటనకు ఏర్పాట్లు సాక్షి,విశాఖపట్నం: కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. నష్టాలపై బృందానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. ప్రభుత్వం తరపున నష్టాలను నివేదించేందుకు రాష్ర్టమంత్రిఒకరు రానున్నారని, రాష్ర్టవిపత్తుల నిర్వహణ కమిషనర్ కూడా పాల్గొంటారన్నారు. నాలుగు జిల్లాల్లో జరిగిన తుఫాన్ నష్టాలపై జిల్లాకలెక్టర్ కార్యాలయంలో 28వ తేదీమధ్యాహ్నం వివరించి ఒక నివేదిక అందజేయనున్నట్టుకలెక్టర్ తెలిపారు. నాలుగు జిల్లాల్లో వివిధశాఖలకు తుఫాన్ కారణంగా రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. -
కువైట్ వైఎస్సార్సీపీ సాయం రూ.4.7 లక్షలు
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ బాధితుల సహాయార్థం కువైట్‌లోని వైఎస్సార్ సీపీ గల్ఫ్ విభాగం తరపున రూ.4.7 లక్షల విరాళాన్ని వైఎస్సార్ ఫౌండేషన్‌కు అందచేశారు. పార్టీ గల్ఫ్ విభాగం కోఆర్డినేటర్ బీహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఈ మేరకు చెక్కును అందించారు. కష్టాల్లో ఉన్న సాటి తెలుగువారిని ఆదుకునేందుకు కువైట్ తెలుగువారు స్పందించి విరాళాలు ఇచ్చినట్లు ఇలియాస్ తెలిపారు. వారి వితరణను జగన్ అభినందించారు. జగన్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్బాష, మేయర్ సురేష్‌బాబు, కువైట్ ప్రవాసులు జి.ఎస్.బాబురాయుడు, ఎస్.గయాజ్‌బాష, ఎస్.నజీర్, బాబు పాల్గొన్నారు. -
ఒక్కటవుతున్న పవన్, మహేశ్
టాలీవుడ్ అగ్రతారలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఒక్కటై వేదిక మీదకు వస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు పండగే కదూ. సరిగ్గా ఇదే సన్నివేశం హైదరాబాద్‌లో ఈనెల 30వ తేదీన కనిపించబోతోంది. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోడానికి పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సహా పలువురు టాలీవుడ్ అగ్ర నటులు ఓ స్టార్‌నైట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానులను అలరిస్తారు. తమిళ సూపర్స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటారని సమాచారం. ప్రముఖ దర్శకుడు, పంచ్ డైలాగుల నిపుణుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ కార్యక్రమం మొత్తం సాగుతుందని సినీవర్గాలు అంటున్నాయి. అక్టోబర్ 12వ తేదీన విశాఖ పరిసరాల్లో అల్లకల్లోలం సృష్టించిన హుదూద్ తుఫాను కారణంగా సుమారు 70వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. దీని నుంచి అక్కడి రైతులు, విశాఖ వాసులు ఇప్పటికీ కోలుకోలేకపోయారు. -
రసాభాసగా చీరల పంపిణీ
వితరణం రసాభాసగా హుద్‌హుద్ బాధితులకు చీరల పంపిణీ భారీగా తరలిరావడంతో తొక్కిసలాట కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమం రసాభసా అయింది. ఊహించని రీతిలో తరలివచ్చిన బాధితులకు కిట్లు పంపిణీ చేయలేక కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేయడంతో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. టర్నర్ చౌల్ట్రీలోని విశాఖ సెంట్రల్ ఎదురుగా సుమారు 14 డివిజన్లకు చెందిన బాధితులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీ సీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నా రు. సాయం పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి సాయం అందే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలోని 50 వేల మంది బాధితులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం ఓ అరడజను మందికి నేతలు దుప్పట్లు, చీరల కిట్లను పంపిణీ చేశారు. డివిజన్‌కు 400 మంది వంతున నగర పరిధిలోని పది డివిజన్ల నుంచి ప్రత్యేకంగా కూపన్లు పంపిణీ చేశారు. కూపన్లున్న బాధితులు మాత్రమే రావాల్సిందిగా సూచించారు. వీరి కోసం విశాఖ సెంట్రల్ ఎదురుగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీరేనా బాధితులు.. మేము కాదా అంటూ వేలాదిగా వచ్చిన బాధితులు నాయకులతో వాగ్వాదానికి దిగా రు. అర్హులైన వారికి కాకుండా పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. నాయకులు వారించినా వినిపించుకోకుం డా కౌంటర్లలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశా రు. దీంతో పరిస్థితి చేజారిపోతుందనే భయం తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ముఖ్య నేతలంతా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. మిగిలిన నాయకులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అంతవరకు క్యూలైన్లలోఉన్న వారు సైతం ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు తోసుకురావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకదశలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో బాధితులు కిందపడి పోయారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య బాధితులతో పాటు కార్యకర్తలు కూడా కౌంటర్లలోకి చొరబడి అందినకాడికి పట్టుకుపోయారు. రెండు మూ డు వందల మందికి కూడా పంపిణీ చేయకుం డానే కిట్లు మాయం కావడంతో నాయకులు కూడా చేసేది లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళా కాంగ్రెస్ సిటీఅధ్యక్షురాలు రమణికుమారి, ఎస్సీ సెల్ చైర్మన్ కె.వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ ఫౌండేషన్‌కు ఉమ్మారెడ్డి రూ.లక్ష విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాన్ వల్ల నష్టపో్యిన బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముందుకొచ్చారు. తుపాన్ బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్‌కు ఉమ్మారెడ్డి లక్ష రూపాయలు విరాళం అందజేశారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాన్ బాధితులకు సహాయం చేసేందుకు విరాళాలు అందజేస్తున్నారు. -
హూదూద్ బాదితులకు అండగా నిలిచిన వైస్సార్ ఫౌండేషన్,సాక్షి