ఒక్కటవుతున్న పవన్, మహేశ్ | pawan kalyan and mahesh babu come together for hudhud victims | Sakshi
Sakshi News home page

ఒక్కటవుతున్న పవన్, మహేశ్

Published Sat, Nov 8 2014 5:11 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఒక్కటవుతున్న పవన్, మహేశ్ - Sakshi

ఒక్కటవుతున్న పవన్, మహేశ్

టాలీవుడ్ అగ్రతారలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఒక్కటై వేదిక మీదకు వస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు పండగే కదూ. సరిగ్గా ఇదే సన్నివేశం హైదరాబాద్లో ఈనెల 30వ తేదీన కనిపించబోతోంది. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోడానికి పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సహా పలువురు టాలీవుడ్ అగ్ర నటులు ఓ స్టార్నైట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానులను అలరిస్తారు. తమిళ సూపర్స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటారని సమాచారం.

ప్రముఖ దర్శకుడు, పంచ్ డైలాగుల నిపుణుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  ఈ కార్యక్రమం మొత్తం సాగుతుందని సినీవర్గాలు అంటున్నాయి. అక్టోబర్ 12వ తేదీన విశాఖ పరిసరాల్లో అల్లకల్లోలం సృష్టించిన హుదూద్ తుఫాను కారణంగా సుమారు 70వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. దీని నుంచి అక్కడి రైతులు, విశాఖ వాసులు ఇప్పటికీ కోలుకోలేకపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement