star night
-
మలేషియాలో బుల్లితెర నటీనటుల స్టార్‌నైట్
మలేషియాలో బుల్లితెర నటీనటుల సంఘం బ్రహ్మాండంగా స్టార్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆ సంఘం అధ్యక్షుడు రవివర్మ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ బుల్లితెర దివంగత నటుడు ఎస్ఎన్.వసంత్ ప్రయత్నంతో 2003లో బుల్లితెర నటీనటుల సంఘం ఏర్పడిందని తెలిపారు. కాగా ఇన్నేళ్లుగా సంఘాన్ని నడుపుతున్నా, సంఘానికి పెద్దగా నిధిగానీ, భవనాన్ని గానీ ఏర్పరచుకోలేకపోయామన్నారు. ఆ కొరతను తీర్చడానికే బుల్లితెర నటీనటుల సంఘం తరఫున మలేషియాలో స్టార్‌నైట్ కార్యక్రమాన్ని నిర్వహించి నిధిని సేకరించతలపెట్టామని తెలిపారు. సంఘసభ్యుల సంక్షేమం కోసం ఆగస్ట్ 17న ఈ స్టార్‌నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. మలేషియాలోని షా అలామ్ సిలాంగర్ మెలావాటి గ్రౌండ్లో ఈ స్టార్‌నైట్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో బుల్లితెర నటీనటులతో పాటు వెండితెర నటీనటులు పలువురు పాల్గొననున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నటుడు నాజర్, ఐసరిగణేశ్ పాల్గొన్నారు. -
లాస్ఏంజిల్స్లో ఘనంగా 'టాస్క్' స్టార్ నైట్
లాస్ఏంజిల్స్ : దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం(టాస్క్) ఆధ్వర్యంలో లాస్ఏంజిల్స్లో స్టార్ నైట్ నిర్వహించారు. 2200 మందికిపైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక పక్క ఇండియన్ ఐడిల్ - రేవంత్, ఫిలిం ఫేర్ అవార్డు గ్రహీత మధు ప్రియ, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి సోదరి ఆదర్శిని సినిమా పాటలతో అదరగొడితే మరొక పక్క తెలంగాణా జానపద గీతాలతో భిక్షు నాయక్, సాయి చంద్ హూషారెత్తించారు. ఆలీ, సుడిగాలి సుధీర్ కామెడీ రియాలిటీ గేమ్‌తో నవ్విస్తే, యాంకర్లుగా అల్లరి ధనరాజ్, చిత్రలేఖ అలరించారు. గ్లామర్ తారలు మన్నారా చోప్రా (ప్రియాంక చోప్రా సోదరి), అంగనా రాయ్ తమ నృత్యాలతో మెప్పించారు. దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘంలోని ఔత్సాహిక సభ్యులు చేసిన డ్యాన్సులు అతిథులను ఆకట్టుకున్నాయి. అలాగే ఆరు బయట చక్కని సాయంత్ర సమయంలో మహిళల కోలాటం, జానపద పాటలకు నృత్యాలు రంజింపజేశాయి. గోదావరి రెస్టారెంటు వారు అందించిన రుచికరమైన భోజనాన్ని ఒక పక్క ఆస్వాదిస్తూ మరోపక్క ఆరు బయట జరిగిన నృత్య విన్యాసాలను ప్రేక్షకులు వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు సంఘం సభ్యులకు అందించడం కోసం వందకు పైగా వాలంటీర్లు ఎన్నో రోజులుగా శ్రమించారు. ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి సాముల, కార్య నిర్వాహక సభ్యులు ప్రవీణ్ ఆళ్ల, బుచ్చిరెడ్డి, సూర్య రెడ్డి, రామ్ కొడితల, సువర్ష కామర్సు, రామకృష్ణ శీలంలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. -
నవ్వుల ఝరిలో...
-
ఒక్కటవుతున్న పవన్, మహేశ్
టాలీవుడ్ అగ్రతారలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఒక్కటై వేదిక మీదకు వస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు పండగే కదూ. సరిగ్గా ఇదే సన్నివేశం హైదరాబాద్‌లో ఈనెల 30వ తేదీన కనిపించబోతోంది. విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోడానికి పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సహా పలువురు టాలీవుడ్ అగ్ర నటులు ఓ స్టార్‌నైట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానులను అలరిస్తారు. తమిళ సూపర్స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటారని సమాచారం. ప్రముఖ దర్శకుడు, పంచ్ డైలాగుల నిపుణుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ కార్యక్రమం మొత్తం సాగుతుందని సినీవర్గాలు అంటున్నాయి. అక్టోబర్ 12వ తేదీన విశాఖ పరిసరాల్లో అల్లకల్లోలం సృష్టించిన హుదూద్ తుఫాను కారణంగా సుమారు 70వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. దీని నుంచి అక్కడి రైతులు, విశాఖ వాసులు ఇప్పటికీ కోలుకోలేకపోయారు.