శ్రీకాంత్ జట్టు విజయం
విజయవాడ:హుదూద్ తుపాను బాధితుల సహాయార్ధం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన టాలీవుడ్ సినీ తారల క్రికెట్ మ్యాచ్ లో తరుణ్ జట్టుపై శ్రీకాంత్ జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీకాంత్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన తరుణ్ జట్టు 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. లక్ష్యంగా భారీగా ఉండటంతో తరుణ్ జట్టు వరుస వికెట్లను కోల్పోయి పరాజయం పాలైంది.