Sinitarala cricket match
-
శ్రీకాంత్ జట్టు విజయం
విజయవాడ:హుదూద్ తుపాను బాధితుల సహాయార్ధం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన టాలీవుడ్ సినీ తారల క్రికెట్ మ్యాచ్ లో తరుణ్ జట్టుపై శ్రీకాంత్ జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీకాంత్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన తరుణ్ జట్టు 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. లక్ష్యంగా భారీగా ఉండటంతో తరుణ్ జట్టు వరుస వికెట్లను కోల్పోయి పరాజయం పాలైంది. -
స్టార్ క్రికెట్ మ్యాచ్‌లో పరుగుల వర్షం
హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం విజయవాడలో జరుగుతున్న సినీతారల క్రికెట్ మ్యాచ్‌లో పరుగుల వర్షం పోటెత్తుతోంది. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహిస్తున్న టి-20 మ్యాచ్‌లో టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, తరుణ్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీకాంత్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. నిఖిల్ 40, నందకిశోర్ 35 పరుగులు చేశారు. తరుణ్ జట్టు లక్ష్యఛేదనలో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ కోసం మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు యువ హీరో రామ్ చరణ్ తేజ్, పలువురు హీరోయిన్లు, కామెడియన్లు, యాంకర్లు వచ్చారు. తమ అభిమాన నటులను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. క్రికెట్ మ్యాచ్‌తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జట్లు: తరుణ్ ఎలెవన్ : తరుణ్(కెప్టెన్), నరేష్, నితిన్, ప్రిన్స్, విశ్వా, సందీప్‌కిషన్, రఘు, రాజీవ్‌కనగాల, అయ్యప్ప, సామ్రాట్, అజయ్, శర్వానంద్. శ్రీకాంత్ ఎలెవన్: శ్రీకాంత్( కెప్టెన్), నాని, నిఖిల్, అదర్శ్, సాయిధర్మతేజ, మనోజ్, నవీన్‌చంద్ర, సుధీర్, నందకిషోర్, ప్రభు, కార్తీక్, ఖయ్యూం, భూపాల్, సమీర్, శశాంక్ . -
స్టార్ క్రికెట్‌కు సర్వంసిద్ధం
హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న సినీతారల క్రికెట్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్, తరుణ్ జట్లు పోటీ పడనున్నాయి. విజయవాడ స్పోర్ట్స్ : హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, శ్రీమిత్రా గ్రూపు సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరుగనున్న స్టార్ క్రికెట్ కప్‌కు సర్వం సిద్ధమైంది. సినీహీరో రామచరణ్‌తేజ ప్రత్యేక గౌరవ అతిథిగా హాజరయిన శ్రీమిత్ర చౌదరి తెలిపారు. ప్రత్యేక విమానంలో రామ్‌చరణ్‌తేజ ఆదివారం ఉదయం నగరానికి చేరుకుంటారని తెలిపారు. ప్రముఖ సినీనటులు, జబర్దస్త్ ఫేమ్ కామెడీ ఆర్టిస్టులు సందడి చేయనున్నారు. స్టేడియం మ్యాచ్‌కు కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ట్వంటీ20 క్రికెట్ మ్యాచ్‌తో పాటు సెలబ్రెటీలు తమ వలపులు ప్రదర్శించనున్నారు. డ్యాన్స్‌లు, కామెడీ షోలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రియమణి,రకుల్‌ప్రీత్‌సింగ్, అధ్హాశర్మ, రాశీఖన్నా, నికీషాపటేల్, సన్నిధి, సురభీ, నిఖితాదివ్య వంటి సెలబ్రెటీలు పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విభావరి ఉంటుంది. హంసనందిని, ర జీనా, షాన్వీశ్రీవాస్తవ, కామ్నాజఠ్మలానీ డ్యాన్స్‌లతో యువతను ఉర్రూతలూగించనున్నారు. యాంకర్లు అనసూయ, రేష్మీలు, కామెడీ యాక్టర్లు వేణు, ధన్‌రాజ్, షకలక శంకర్, చమక్ చంద్రా, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి పాల్గొంటున్నారు. శ్రీకాంత్ ఎలెవన్, తరుణ్ ఎలెవన్ జట్లుతలపడుతున్నాయి. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలు తమ వస్తువులను ప్రమోట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. తరుణ్ ఎలెవన్ : తరుణ్(కెప్టెన్), నరేష్, నితిన్, ప్రిన్స్, విశ్వా, సందీప్‌కిషన్, రఘు, రాజీవ్‌కనగాల, అయ్యప్ప, సామ్రాట్, అజయ్, శర్వానంద్. శ్రీకాంత్ ఎలెవన్: శ్రీకాంత్( కెప్టెన్), నాని, నిఖిల్, అదర్శ్, సాయిధర్మతేజ, మనోజ్, నవీన్‌చంద్ర, సుధీర్, నందకిషోర్, ప్రభు, కార్తీక్, ఖయ్యూం, భూపాల్, సమీర్, శశాంక్ .