అమెరికాలో రక్తదాన శిబిరం | Dr. YSR Foundation’s Blood Drive in Philadelphia | Sakshi
Sakshi News home page

అమెరికాలో రక్తదాన శిబిరం

Published Wed, Sep 3 2014 10:16 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Dr. YSR Foundation’s Blood Drive in Philadelphia

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి  ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అతిథులుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి హాజరు కానున్నారు.

రక్తదాన శిబిరం ఫిలడెల్ఫియా సమీపంలోని కింగ్ అఫ్ పర్షియాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాలీ ఫోర్జ్ రాడిస్సన్ హోటల్ లో ఉంటుందని, ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ అభిమానులంతా సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. అందరూ కుటుంబ సమేతంగా మహానేత వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చి దాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు ysr_usa@yahoo.comకు ఇ-మెయిల్ పంపాలని లేదా డాక్టర్ రాఘవరెడ్డి (267-261-9436), ఆళ్ల రామిరెడ్డి (973-386-8980) లను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement