
సాక్షి, దోహా: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత వైఎస్ జగన్ పాదయాత్ర 1000కిలోమీటర్లు పూర్తి కానున్న సందర్భంగా ఖతార్‌లో ఉమ్ సలాల్ఆలీ అనే ప్రాంతంలో ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శశికిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు.
ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం మనకు కలుగుతుందని ఆయన అన్నారు. పేదవారికి సంక్షేమ పధకాలు అందడం లేదు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వానికి చమరగీతం పాడి 2019లో వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని శశికిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త సాంబశివరావు, సామాజిక సేవకులు బి విల్సన్ బాబు, ఎన్. నాగేశ్వరరావు, మనిష్, జాఫర్, ప్రశాంత్, కిశోర్, గిరిధర్, రత్నం, భార్గవ్, రాజశేఖర్, అరుణ్, సాగర్ కోలా, సునీల్, ఇంజేటి శ్రీను, సునీల్, సుభాని, వైఎస్‌ఆర్ కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.