
సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సిద్ధలయ్యకోన, పోకందుల క్రాస్, ఊటుకూరు, గిద్దలూరు క్రాస్, తురిమెర్ల, కలిచేడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తురిమెల్లలో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అలాగే కలిచేడులో చేనేతలతో ముఖాముఖి అవుతారు. వైఎస్ జగన్ రాత్రికి కలిచేడులోనే బస చేస్తారు. పాదయాత్ర షెడ్యూల్‌ను సోమవారం వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం విడుదల చేశారు.
సైదాపురంలో ముగిసిన 74వ రోజు పాదయాత్ర
74వ రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్ జగన్ సైదాపురంలో ముగించారు. ఇవాళ ఆయన 12.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. గోగినేనిపురం, చెన్నూరు, వెంకటగిరి క్రాస్, తూర్పు పుండ్ల క్రాస్ మీదగా వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఇప్పటివరకూ ఆయన మొత్తం 1005 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా వైఎస్ జగన్...సైదాపురంలో విజయసంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించారు.