Y.S.Rajasekhara Reddy
-
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైయస్ఆర్ 75వ జయంతి వేడుకలు న్యూ జెర్సీ, మన్రో లోని థాంప్సన్ పార్కులో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. 300 మందికి పైగా వైఎస్సార్ అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో వైస్సార్ ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కి పైగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయం లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బాగ్స్, కంప్యూటర్ లాబ్స్, మెడికల్ కిట్స్ , ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు.. దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అని డాక్టర్ రాఘవ రెడ్డి గోసల పేర్కొన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ ఉపయోగించుకొని ఎంతోమంది ఈ రోజు అమెరికా లో వున్నారు అంటే.. రాజశేఖర రెడ్డి ముందుచూపే కారణం అని రాజేశ్వర్ రెడ్డి గంగసాని తెలిపారు. నదులను అనుసంధానం చేయడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీకాంత్ కోరారు.భానోజీ రెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, రమణా రెడ్డి తో పాటు పలువురు వక్తలు వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనియాడారు. అందరూ కలసి ఇలా ఒకేచోట చేరి.. వనభోజనాలతో వైఎస్సార్ జయంతి నిర్వహించటం.. ఆయన ప్రజల గుండెల్లో వున్నాడు అనటానికి చిహ్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, నాగి రెడ్డి , రామమోహన్ రెడ్డి, భానోజీ రెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి , తదితరులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కార్యకర్తకు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ .. పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది. -
కల.. నెరవేరే వేళ..
పాలకుర్తి: సాగునీటి కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అన్నదాతల కల త్వరలో నెరవేరబోతోంది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను ముందుకు కదిలించారు. నిత్యం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు కృషి చేస్తుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో విడతలో భాగంగా 2009 సంవత్సరంలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన పాలకుర్తి ప్రాజెక్టు పనులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయించాలనే లక్ష్యంతో ముందుకుసాగారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి తగినన్ని నిధులు మంజూరు చేయాలని విజప్తి చేశారు. రిజర్వాయర్‌కు రూ. 11 కోట్లు మంజూరు.. పాలకుర్తి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 11 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సుమారు 700 ఎకరాల భూమిని సేకరించారు. గతంలో 250 ఎకరాలు ఉన్న పాలకుర్తి ఊరచెరువు కొత్తగా సేకరించిన 700 ఎకరాలతో 950 ఎకరాల విస్తీర్ణానికి చేరింది. కాగా, 2009లో శంకుస్థాపన జరిగిన పనులు ఎట్టకేలకు ఈనెల 15న ప్రారంభమయ్యాయి. 0.25 టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు పనులను క్రాంతి కన్స్ట్రక్షన్స్ అధినేత సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడు నెలల్లో రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేసి పాలకుర్తి మండలంలోని తీగారం, లక్ష్మీనారాయణపురం, విస్నూరు, వల్మిడి, ముత్తారం, మంచుప్పుల శిరసన్నగూడెం తదితర గ్రామాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
అందరికీ ‘అభయం’
ఆదిలాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)లోని సభ్యులకు భరోసా కల్పించే అభయహస్తం పథకం ఇక పూర్తిగా మారనుంది. సభ్యులు, వారి భర్తలకు సైతం బీమా కల్పించేలా పథకంలో మార్పులు చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సైతం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమలులోకి రానున్నట్లు సమాచారం. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందిస్తున్న అభయహస్తం పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సభ్యులు తమ వాటాగా చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోంటోంది. ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగి ఇచ్చేయాలని భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బీమా సౌకర్యం, వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009లో ‘అభయహస్తం’ పథకం ప్రారంభించారు. 18నుంచి 60ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ పథకం కింద రూ.500 పింఛన్ చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 39,672 ఉండగా, 4,24,380 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 7,352 మంది అభయ హస్తం పింఛన్‌దారులు ఉండగా, 1,46,451 మంది మాత్రమే ఈ పథకంలో చేరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేస్తుండడంతో సంఘాల్లోని మొత్తం సభ్యులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. సభ్యులుగా ఉన్న వారి భర్తలకు కూడా బీమా పథకం వర్తించనుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీమా వర్తించే వారి సంఖ్య 8.50 లక్షలకు చేరనుంది. పథకంలో పూర్తిస్థాయిలో మార్పులు చేయనుండడంతో సభ్యులకు మరింత లాభం చేకూరనుంది. బీమా ఉచితమే.. ఈ పథకాన్ని పూర్తిగా ఉచితంగా అమలు చేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. పథకంలో సభ్యులు బీమా కింద ఏటా రూ. 360, పింఛన్‌దారులు రూ. 356 చెల్లిస్తున్నారు. వీరు చెల్లించిన వాటికి అంతే మొత్తంలో ప్రభు త్వం తన వాటా చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం కొత్త మా ర్పులు చేయడంతో ఈ పథకంలో ఇప్పటి వరకు బీమా సొమ్ము కడుతున్న వారి వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో పాటు ఇప్పటి వరకు సభ్యులు చెల్లించిన బీమా మొత్తాన్ని వారికి తిరిగి ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 13 నెలలుగా అందని పింఛన్.. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అండగా నిలిచేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ ‘ఇందిరా అభయహస్తం’ పథకానికి 2009లో శ్రీకారం చుట్టారు. స్వయం సహాయ సంఘాల్లో సభ్యులై ఉండి, 60 ఏళ్లు నిండిన వృద్దులకు ఈ పథకం వర్తింపజేశారు. గతంలో సామాజిక పింఛన్ రూ.200 ఇస్తే.. అదే సమయంలో అభయహస్తం పింఛన్ రూ.500 ఇచ్చారు. ఒకప్పుడు నెలనెలా వృద్ధులకు ఆసరాగా నిలిచిన ఈ పింఛన్ ప్రస్తుతం పాలకుల తీరుతో పండుటాకులకు భరోసా ఇవ్వలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 7,352 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల రూ.500 చొప్పున 2017 జనవరి నుంచి పింఛన్ రావాల్సి ఉంది. నాలుగు జిల్లాల పరిధిలోని లబ్ధిదారులకు రూ. 4.77 కోట్లు రావాల్సి ఉంది. పింఛన్ డబ్బు అవసరానికి అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు. -
వైఎస్ చేశారు కాబట్టి తప్పా?
అదే లీజును బాబు హయాంలో ఇస్తే మాత్రం తప్పులేదా? ఓఎంసీకి లీజు మంజూరు చేసింది చంద్రబాబు కాదా? ఎవరి హయాంలో లీజుకిచ్చినా ప్రభుత్వానికొచ్చే సొమ్ము ఒకటేగా? అప్పటికే ఉన్న కంపెనీకి ఇవ్వలేదంటూ పిచ్చి రాతలెందుకు? కొత్త కంపెనీకి ఇస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి కదా! ఓఎంసీకి నాణ్యమైన, విలువైన ఖనిజం కట్టబెట్టేశారని రాసింది మీరేగా? అక్కడ నాసిరకం తప్ప నాణ్యమైన ఖనిజం లేనేలేదని సీబీఐ తేలిస్తే మీ అబద్ధపు రాతలకు క్షమాపణ చెప్పలేదెందుకు? అఖిలపక్షం డిమాండ్ చేయగానే ఓఎంసీకి కమిటీని పంపింది వైఎస్ కాదా? బ్లాక్ గెలాక్సీపై చంద్రబాబు డ్రామాను ఎన్నడూ బయటపెట్టలేదేం? వేల కోట్ల ముడుపులు చేతులు మారినా మీకు కనిపించలేదా? ఇంకెన్నాళ్లు రామోజీ ఈ విషపురాతలు ఇవి ఎన్నికల కామెర్లు. ‘పచ్చ’ పార్టీ కోసం కొనితెచ్చుకున్న పచ్చకామెర్లు. అంతే!! వచ్చే నెల 7న సీమాంధ్రలో పోలింగ్ ముగిసేదాకా రామోజీకి ఈ వ్యాధి తగ్గే చాన్సే లేదు. అందుకే రోజూ ప్రత్యేక పేజీలు పెట్టి మరీ విషం గక్కటం. లేకపోతే బాబు లీజుకిస్తే తప్పులేదట గానీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన లీజులు మాత్రం అన్నీ తప్పేనట!! ఒక కంపెనీకి బాబు ఇస్తే తప్పులేదు గానీ అదే కంపెనీకి వైఎస్సార్ ఇస్తే మాత్రం ఘోరమట!! నామా నాగేశ్వరరావుకు గ్రానైట్ లీజులిచ్చినా, రిలయన్స్‌కు కోస్తా తీరం మొత్తాన్ని కబళించేసుకోవచ్చని వీలునామా రాసేసినా... అవన్నీ జాతి ప్రయోజనాల కోసం చేసినవట!! ఎందుకంటే నామా బాబు అనుచరుడు కాబట్టి... రిలయన్స్ సంస్థ తన కంపెనీల్లో రూ.2,400 కోట్లు ‘‘పెట్టుబడి’’ పెట్టింది కాబట్టి!! ఇది ఏ మార్కు పాత్రికేయం రామోజీ? ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంతకాలం మీ రాతలతో అంధకారంలో ఉంచుతారు? గురువారంనాడు ‘ఘనులు తీసిన గోతులు’ అంటూ ఒక పేజీ నిండా వండేసిన మీ కథనం ఏ మార్కు జర్నలిజం? భూమిలో ఉన్న ఖనిజం తవ్వకుండా బయటికొస్తుందా? గనులు తవ్వాక గోతులు రాకుండా ఇంకేం వస్తాయి? ఇవెక్కడి రాతలు? వైఎస్సార్ హయాంలో జరిగిన ప్రతి పనికీ దురుద్దేశం అంటగట్టి... దానికి ఆయన్ను బాధ్యుడిని చేస్తూ రాస్తున్న రాతల్లో ‘‘ఏది నిజం?’’ అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో ఓఎంసీకి 25.99 హెక్టార్లను లీజుకిచ్చింది సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు. 1996, డిసెంబర్ 10న జీవో నంబరు 236 ద్వారా రామ్మోహన్‌రెడ్డికి ఈ లీజుకు అనుమతినిచ్చారు. 1997లో లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు. 2002లో రామ్మోహన్‌రెడ్డి నుంచి ఈ లీజును ఓఎంసీకి బదలాయించింది కూడా చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే. తర్వాత కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామన్న హామీతో వైఎస్ హయాంలో మరో రెండు లీజుల్ని ఓఎంసీ తీసుకుంది. ఇదీ... జరిగిన కథ. వైఎస్ ఇలా చేయటం వల్ల ప్రజా సంపద దుర్వినియోగమెలా అవుతుంది? ఎవరి హయాంలో లీజుకిచ్చినా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో గానీ, పన్నుల రూపంలో గానీ వచ్చే సొమ్ములో తేడాలుంటాయా? ఏ కంపెనీకిచ్చినా సర్కారుకు వచ్చే సొమ్ము ఒకటేకదా! అయినా వెనకబడిన కడప జిల్లాలో 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఆరంభించి 10 మిలియన్ టన్నుల స్థాయికి విస్తరించేలా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించబట్టే ఓఎంసీకి వైఎస్ ప్రభుత్వం లీజు మంజూరు చేసింది తప్ప ఊరికేకాదు. ఈ విషయాన్ని వైఎస్ అసెంబ్లీలోనే చెప్పారు. ఇందులో తప్పేంటి? అప్పటికే నడుస్తూ ఉన్న శాతవాహన లాంటి సంస్థలను పక్కనబెట్టి ఓఎంసీకి లీజుకు ఇచ్చేశారంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. శాతవాహన ప్లాంటు నడుస్తోందంటే దానర్థమేంటి? దానికి ఖనిజం ఉన్నట్లేగా? దీనికి లీజు ఇవ్వడం కంటే కొత్త సంస్థకు ఇస్తే మరో ఫ్యాక్టరీ వస్తుందని, దీనివల్ల మరికొన్ని వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆలోచించటం తప్పా? రామోజీకి ఈ మాత్రం లేదా? అడ్డగోలుగా లీజులు కేటాయించారన్న రామోజీ వాదనలో నిజమెంత? లీజు కోసం వచ్చిన 30 దరఖాస్తుల వివరాలనూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించటం, వాటన్నిటినీ పరిశీలించాక కేంద్రం ఓఎంసీకి లీజుకివ్వటం... ఇవన్నీ రామోజీకి మాత్రమే అడ్డగోలుగా కనిపిస్తాయెందుకు? తన కవల లాంటి చంద్రబాబు చేయలేదనా? లీజుల కేటాయింపులు, రాయల్టీ వసూలుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ఓఎంసీ కోసం ఏమైనా సవరించాయా? అందరికీ వర్తించిన నిబంధనల్నే దీనికీ అమలు చేశారుగా? చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ఈ విధానం ప్రకారమే లక్షల హెక్టార్లకు లీజులు ఇచ్చారుగా? దీన్లో వైఎస్ మాత్రమే చేసిన తప్పేంటి? ఈ మతలబు మీకు తెలీదా రామోజీ? ప్రకాశం జిల్లాలో వేల కోట్ల రూపాయల విలువైన అత్యంత అరుదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు రిజర్వు చేయాలంటూ 1998 డిసెంబర్ 23న చంద్రబాబు నేతృత్వంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీఎండీసీకి గనులను రిజర్వు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించడంతో ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ ప్రతిపాదనలు విరమించుకుంటే అత్యంత భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెబుతామంటూ అప్పటి ప్రభుత్వ పెద్దతో కొందరు ప్రైవేటు ప్రతినిధులు రాయబారాలు నడిపారు. ఆయన కోరుకున్నదీ అదే. ఆయన ఆశించిందీ అదే. బాబు వ్యూహం మేరకు చర్చలు జరిగాయి. మంతనాల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం... ప్రభుత్వ పెద్ద నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లేఖ రాశారు. ‘చీమకుర్తి, తాళ్లూరు మండలాల్లో బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలున్న ప్రాంతాన్ని ఏపీఎండీసీకి రిజర్వు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది’ అన్నదే ఆ లేఖ సారాంశం. ఏపీఎండీసీకి గనుల రిజర్వేషన్ ప్రతిపాదనను విరమించుకున్న చంద్రబాబు సర్కారు చకచకా ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి లీజులు మంజూరు చేసేసింది. జూలై 2000 నుంచి మార్చి 2004 మధ్య ఏకంగా 155 లీజుల కింద 363.945 హెక్టార్ల గ్రానైట్ క్వారీలను లీజుకు ఇచ్చేసింది. ఈ మొత్తం తతంగం ‘ఈనాడు’కు ఏనాడూ తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే ఈ గలీజు కథ నడిపింది తన కవల లాంటి చంద్రబాబు కాబట్టి. వేరే రకంగా ఈ కుంభకోణం బయటకు రాలేదెందుకంటే... అప్పట్లో ‘సాక్షి’ లాంటి మీడియా లేదు కాబట్టి. ఉన్నదల్లా బాకా పత్రికలు, తోకపత్రికలే కాబట్టి!!! ఏమంటారు రామోజీ? ఇది కాదా అసలు నిజం!! ఇవీ... ‘ఈనాడు‘ అడ్డగోలు రాతలు.. వైఎస్ ప్రభుత్వం ఓఎంసీకి అత్యంత నాణ్యమైన, విలువైన ఖనిజాన్ని కట్టబెట్టిందని, దాన్ని తవ్వేసి లక్షల కోట్లు గడించారని గతంలో రాసింది ‘ఈనాడే’. అయితే సీబీఐ దర్యాప్తు జరిపి... ఈ ప్రాంతంలో నాసిరకం ఖనిజం మాత్రమే ఉందని తేల్చటంతో మరో రాగం అందుకుంది. చుట్టుపక్కల వేరేవారు తవ్విన ఖనిజాన్ని... బెదిరించి గాలి జనార్దనరెడ్డి తక్కువ రేటుకు కొని, ఈ లీజు పర్మిట్‌తో ఎగుమతి చేశారని!! అంతే తప్ప తాను మొదట్లో రాసిన కథనాలన్నీ తప్పయినందుకు ఏనాడూ క్షమాపణ చెప్పింది లేదు. మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి? రామోజీ రాతల్లో నిజమెంతో అర్థం కావటం లేదా? పెపైచ్చు తానేం చెప్పినా ‘ఎస్’ అనే అధికారుల్నే వైఎస్ పెట్టుకున్నారంటూ మరో దిగజారుడు రాత. ఏం! శ్రీలక్ష్మిని గానీ, కృపానందాన్ని గానీ ఐఏఎస్‌కు ఎంపిక చేసింది వై.ఎస్.రాజశేఖరరెడ్డా? వాళ్లు చంద్రబాబు హయాంలో పనిచేయలేదా? పర్మిట్లపై ఓఎంసీకి అంటగడుతున్న అభియోగాలన్నీ కోర్టులో ఉన్నవేగా? వాటిపై రామోజీ తీర్పులెందుకు? అయినా క్షేత్ర స్థాయిలో అధికారులో, సిబ్బందో తప్పు చేస్తే అది ముఖ్యమంత్రికెలా తెలుస్తుంది? ఆంధ్ర-కర్ణాటకల మధ్య గనుల సరిహద్దు రేఖలను తేల్చాలని రెండు రాష్ట్రాలూ ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ తేలలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సరిహద్దును ఖరారు చేయాలని సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించి ఏడాదైనా ఇంకా మల్లగుల్లాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ సరిహద్దు రేఖ తేలే వరకూ ఏ లీజు సంస్థ ఎక్కడ అక్రమ తవ్వకాలు జరిపిందో నిర్ధారించలేమని సీబీఐ కూడా చెప్పింది. మరి ఈ వాస్తవాలన్నీ పక్కనబెట్టి రామోజీ రాస్తున్న రాతల్లో నిజం ఎంత? అయినా ఓఎంసీని వైఎస్ ఏనాడైనా వెనకేసుకొచ్చారా? ఆ సంస్థ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడుతోందని, అఖిలపక్షాన్ని పంపాలని విపక్షాలు అడగ్గానే విపక్ష కమిటీని ఓబుళాపురం గనులకు పంపింది వైఎస్ కాదా? అక్కడికి వెళ్లొచ్చిన సభ్యులు తమ దృష్టికి ఎలాంటి అక్రమాలూ రాలేదని మీడియా సమక్షంలోనే ప్రకటించారు. ఇక బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ఓఎంసీకి మధ్య సరిహద్దు వివాదం తలెత్తగా దానిపై ఉన్నతస్థాయి సర్వే బృందాన్ని నియమించిందీ వైఎస్సే. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతకంటే ఏం చేస్తారు? ఇవన్నీ వదిలిపెట్టి రామోజీ రాస్తున్న రాతలకు అర్థమేంటి?