న్యూఢిల్లీ : యోగా సాధన వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవచ్చని ప్రధానీ నరేంద్ర మోదీ తెలిపారు. యోగాతో శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. ఆది వారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగా చేయడం వల్ల ఉల్లాసం, మనోధైర్యం, మానసిక స్థిరత్వం, ఒత్తిడి నుంచి ఉపసమనం పొందవచ్చని అన్నారు. ప్రపంచం మొత్తం యోగాను గుర్తించిందన్నారు. కరోనా దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని తెలిపారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత్ అవలంభించిన యోగాను ప్రపంచం మొత్తం అనుసరిస్తోందని అన్నారు.
చదవండి : శాస్త్రవేత్తలకూ అంతుపట్టని యోగాసనాలు
Comments
Please login to add a commentAdd a comment