వీరు.. ఆసనం పేరేంటో చెప్పవా? | Virender Sehwag Yoga On International Yoga Day Became Viral | Sakshi
Sakshi News home page

వీరు.. ఆసనం పేరేంటో చెప్పవా?

Published Sun, Jun 21 2020 9:13 AM | Last Updated on Sun, Jun 21 2020 12:34 PM

Virender Sehwag Yoga On International Yoga Day Became Viral - Sakshi

ఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ వినూత్న ఆసనంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. వీరు చేసింది ఏంటో తెలియదు గాని అతన్ని పరిశీలిస్తే మాత్రం మొకాళ్ల కిందకు తన చేతులు పెట్టి కేవలం పాదాల సాయంతోనే హాల్‌ ఆవరణలో నడవడం ఆరంభించాడు. పాపం సెహ్వాగ్‌ ఇది చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఏమో కాని వెంటనే ఈ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ' కచ్చితంగా ఇది యోగా అని చెప్పలేను కానీ దానికి కొంత సమయం పడుతుంది' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ప్రస్తుతం సెహ్వాగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'వీరు నువ్వు చేసిన ఆసనం పేరేంటో తెలియదు కానీ నువ్వు చాలా కష్టపడ్డావు'.. ' నీ కష్టానికి ఇవే మా జోహార్లు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (మొర్తజాకు కోవిడ్‌ పాజిటివ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement