
ముంబై : కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. భారత్‌లో 2లక్షల 77వేల కేసులు నమోదవ్వగా 7, 745 మంది మృతిచెందారు. ఇక 90 వేలకుపైగా కేసులతో మహారాష్ట్ర భారత్‌లోనే ప్రథమ స్థానంలో ఉంది. ముంబైలో నటి మలైకా అరోరా నివాసం ఉంటున్న చోటే ఒకరికి కరోనా సోకడంతో బిల్డింగ్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా మార్చారు. జూన్ 8న బిల్డింగ్ సీల్ చేసినట్టు సమాచారం.
ఇక లాక్‌డౌన్‌లో సైతం ఎప్పటికప్పుడు సామాజికమాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉన్న మలైకా, ప్రస్తుతం యోగా ఫోటోలతో అభిమానులకు సూచనలు చేస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లోనూ రోజుకు కనీసం ఒక గంటసేపు యోగా చేయడం మిస్సవనని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రోజుకు ఒక ఆసనం వేస్తూ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు.