
జైపూర్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్ బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనాపురియా వినూత్నంగా ఆసనాలు వేసి అందరి దృష్టి ఆకర్షించారు. తన చుట్టూ అగ్ని వలయాన్ని నిర్మించుకొని అందులో యోగా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్యాంక్ - సవై మధోపూర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ అగ్నివలయంలో అర్థనగ్నంగా కూర్చొని ‘ఓం నమః శివాయ’ అని స్మరిస్తూ యోగా చేశారు. అనంతరం ఒంటి నిండా బురద మట్టిని రుద్దుకొని శవాసనం వేశారు. మట్టి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఎంపీ పేర్కొన్నారు.
కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా యోగా దినోత్సవాన్ని ఇంటివద్దే జరుపుకున్నారు. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి' పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ సైతం వర్చువల్‌గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగా చేయడం వల్ల ఉల్లాసం, మనోధైర్యం, మానసిక స్థిరత్వం, ఒత్తిడి నుంచి ఉపసమనం పొందవచ్చని అన్నారు. ప్రపంచం మొత్తం యోగాను గుర్తించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment