
సాక్షి, సిటీబ్యూరో: సంప్రదాయ నృత్యశైలులను యోగాతో మేళవించడం అంటే అది ఆరోగ్యం ఆనందాల మేళవింపేనని ప్రముఖ నృత్యకారిణి యశోదా థాకూర్ అన్నారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) ఆధ్వర్యంలో ‘ది డ్యాన్స్ ఆఫ్ యోగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సదస్సులో యశోదా థాకూర్ మాట్లాడుతూ యోగా స్వచ్ఛమైన ఆలోచనల్ని తద్వారా కైవల్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందని పతంజలి యోగా చెబుతోందని, అలాగే నాట్యం ట్రాన్స్‌లోకి తీసుకెళుతుందని దీని అర్థం ఇవి రెండింటి వల్ల కలిగేది దాదాపుగా ఒకే రకమైన స్థితిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని యోగా, నాట్య భంగిమలపై ప్రదర్శన సహితంగా వివరించారు. కార్యక్రమంలో ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ చైర్ పర్సన్ ఉషారాణి మన్నె పాల్గొన్నారు.
ఇమ్యూనిటీ పెంచేఐస్‌క్రీమ్
ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ డైరీ డే..సరికొత్త ఐస్‌క్రీమ్‌ను సిటీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. డైరీ డే ప్లస్ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఐస్‌క్రీమ్ ప్రస్తుత పరిస్థితిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ప్రత్యేకమైన ముడిదినుసులతో తయారైందని వివరించారు. హైదీ (టర్మరిక్) ఐస్‌క్రీమ్, చ్యవన్‌ప్రాశ్ ఐస్‌క్రీమ్ పేరుతో 2 ఫ్లేవర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు
యోగాతో పాటు ఆల్మండ్స్...
రోగనిరోధక శక్తి పెంచడంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ఆహారం అంతే ముఖ్యమని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాయామాల్లో యోగా ఉత్తమమైనదని, ఆహార పదార్థాల్లో బాదం ఎంతో ప్రయోజనకరమన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరవాసులు ఆహారంలో ఆల్మండ్స్‌ని విరివిగా వినియోగించేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభించామన్నారు. దీనిలో సూపర్ మోడల్, ఫిట్‌నెస్ నిపుణుడు మిళింద్ సోమన్, బాలీవుడ్ నటి సోహా అలీఖాన్‌లతో పాటుగా న్యూట్రిషన్, వెల్‌నెస్ కన్సెల్టెంట్ షీలా కృష్ణస్వామి తదితర ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment