యోగానందం
ఆంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. విద్యాసంస్థలు, వసతిగృహాల్లో విద్యార్థులు వివిధ రకాల ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు.
శ్రీశైలం: ఆంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. విద్యాసంస్థలు, వసతిగృహాల్లో విద్యార్థులు వివిధ రకాల ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. యోగా సాధన.. ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికానందం చేకూర్చుతుందని యోగా గురువులు ఉద్భోదించారు. యోగాకు ఆది గురువైన పరమేశ్వరుడు కొలువుదీరిన శ్రీశైలమహాక్షేత్రంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందితో ఉదయం 8గంటల నుంచి 9.30గంటల వరకు యోగాసనాలు వేయించారు. ఇక నుంచి ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని శ్రీశైలదేవస్థానం నిర్వహించేలా చేస్తానని ఈఓ భరత్‌గుప్త ప్రకటించారు.