
సాక్షి, అమరావతి : ఒకే సమయంలో ప్రశాంతత, బలాన్ని ప్రసాదించే విశేషమైన శక్తి యోగాకు ఉందని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. యోగాతో శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారు. యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రజలు ఈ పురాతన అభ్యాసాన్ని తమ జీవితంలో భాగం చేసుకునేలా ప్రతినబూనాలని కోరారు. ( తమిళనాట జగనన్నకు జై )
అంతకు క్రితం ఆయన భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నంపై విచారం వ్యక్తం చేశారు. ‘ఇది మనం ఐక్యతను, మన సాయుధ దళాల పట్ల సంఘీభావాన్ని చాటాల్సిన సమయం. అంతేగానీ.. ఒకరి పట్ల మరొకరు వేలెత్తి చూపించుకోవడమో లేక తప్పులను ఎత్తి చూపించుకోవడమో చేసుకునే సమయం కాదు. అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి, ఇతర మంత్రులు చాలా ఆమోద యోగ్యమైన, విశ్వసనీయమైన సమాధానాలు చెప్పారు. ఈ విషయమై జాతి యావత్తు ఏకతాటిపై నిలబడాలి. ఐక్యత బలాన్ని ఇస్తుంది. విభజన బలహీనతను ప్రదర్శిస్తుంది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ( యోగాతో కరోనాను ఎదుర్కోవచ్చు: ప్రధాని మోదీ)
Yoga has the distinctive power to manifest tranquility and strength at the same time. It heals not only the body, but also the spirit. On, #InternationalYogaDay, let us pledge to make this age-old practice an integral part of our lives.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2020
Comments
Please login to add a commentAdd a comment