ఈడు మడతల ధూళి దులుపుతూ.. ఏజ్ ను మరిపించడమేకాక సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే వ్యాయామ సాధనం యోగా. అందుకే 'బం చిక్ బం బం చెయ్యి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా' అనే పాట కూడా పుట్టింది. మోదీ ప్రభుత్వం చొరవ, ఐక్యరాజ్యసమితి అంగీకారంతో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తింపు పొందింది. ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనే క్రమంలో భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాలు యోగాడే రిహార్సల్స్ లో మునిగిపోయాయి. ఇక జనచైనాలో గతేడాది మాదిరే భారీ ఎత్తున యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
అన్నింటిలోకి 1300 అడుగుల ఎత్తులోని గాజు కట్టడంపైన యువతులు చేసిన యోగా ప్రదర్శన హైలెట్. బీజింగ్ నగర శివారులోని జింగ్ డాంగ్ స్టోన్ ఫారెస్ట్ లో గల గాజు కట్టడం(జార్జ్ సీనిక్ స్పాట్) పై 150 మంది యువతులు యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఆ విన్యాసానికి సంబంధించిన ఫొటోలు మీ కోసం..